50 ఏళ్ళ కు పైగా తెలుగు చదువరులకు వో దిక్సూచిగా ఉన్న మాలతీ చందూర్ గారిని ఎంత పొగిడినా తక్కువే అవుతుంది . నేను ఆమె అజ్ఞాత శిష్యుడిని. నా డిగ్రీ లు నన్ను వో సంపాదన పరుడి గా చేస్తే నన్ను వ్యక్తి గా తీర్చి దిద్దిన మహత్తర శక్తీ శ్రీమతి మాలతీ చందూర్ గారే. ప్రముఖ ఆంగ్ల సాహిత్యాన్ని తెలుగు లో నా నోటి కి అందించి నా విజ్ఞాన ప్రపంచాన్ని విస్తృత పరిచింది ఆమె. మా అమ్మా , అక్క అన్నయ్య, నా చిన్న నాడే నాకు ఈ అమృతాన్ని గురించి బోధ చేసి కలశం అందించారు. అంతే నేను వో క్రొత్త లోకం లోకి అడుగు పెట్టాను. స్చూల్స్ వదిలి కాలేజీ కి , కాలేజీ వదిలి వృత్తి విద్య లోకి ఆ తరువాత వ్రుత్తి లోకి వచ్చినా ఆమె అక్షరం నాకు మార్గ దర్శి . సాహస ఘర్బం లో సాహస యాత్ర నుండి స్కార్లెట్ పిమ్పెర్నేల్ , 80 రోజుల్లో భూ ప్రదక్షిణం నన్ను వో విశాల సాహితీ ప్రాంగణం లో కి తీసుకు వెళ్ళాయి. తెలుగు అనువాదాలే ఇంత బాగుంటే వీటి ఆంగ్ల మూలాలు ఇంకెంత బాగుంటాయో అని నా లో జిజ్ఞాస పెంచి నన్ను ఇంగ్లీష్ నేర్చుకొనే లాగా , ఆ పయిన , ఆంగ్ల సాహిత్యం చదివి ఆకళింపు చేసుకొనే లాగా, ఆనందించే లాగా నన్ను మలిచాయి ఈమె రచనలు. నేను అమెరికా వెళ్ళటానికి వో ఇంటర్వ్యూ కు వెళ్ళ వలసి వచ్చింది, ఆ ఇంటర్వ్యూ లో నాకు వెన్ను దన్నుగా నిలిచింది నా లో ఆమె రగిల్చిన ఆసక్తి . నాకు ఇప్పుడు 62 ఏళ్ళు ఆమె క్రమము తప్పకుండ వ్రాస్తున్న పాత కెరటాలు స్వాతి మాస పత్రిక లో నాకు నిత్య పారాయణాలు. నా లాగే ఎందఱో అభిమానుల్ని ఆమె తనకు తెలియ కుండానే అక్కున చేర్చుకున్న శ్రీమతి మాలతీ చందూర్ గారు ఆరోగ్యం గా ఇలాగె అందరిని ఆనంద పరచాలని కోరుకుంటున్నా. కోతి కొమ్మంచి లో ముళ్ళ పూడి వారు చందూర్ దంపతుల తో తన అనుభవం గురించి చదివినప్పుడు నా కళ్ళు
అప్రయత్నం గా చెమ్మగిల్లాయి, ఆమె మంచి మనీషి కూడా అని తెలుసుకొని మరింత ఆనందించాను.
No comments:
Post a Comment