Friday, December 10, 2010

ఉర్దూ - తెలుగు నిఘంటువు

ఉర్దూ - తెలుగు నిఘంటువు వొకటి ఉన్నదని పుస్తక సమీక్ష లో చదవంగానే పరిగెత్తుకొని వెళ్లి ఆ పుస్తకం కోనేసుకొని ఇంటికి వచ్చి తనివీ తీరా తిరగేసి ఎంత ఆనంద పడి పోయానో , మాటలకందని వో అనుభూతి. ఎమెస్కో వారి గొప్ప ఆలోచన కి మనం జోహారులు చెప్పవలసిందే.
మా మూలుగా డిక్షనరీ అంటే వో ఇంగ్లీష్ /ఉర్దూ/హిందీ/ పదం  దానికి తెలుగు లో అర్థం ఉండటం మనకు తెలిసిందే. ఇలాంటి పుస్తకాలు ఉపయోగించాలంటే మనకు ముందు గా ఆ భాషలో కొంచం ప్రాథమిక మైన పరిజ్ఞానం ఉండాలి, ఆ భాష చదవటం తప్పని సరిగా వచ్చి ఉండాలి. మరి ఉర్దూ రాని నా బోటి ఎంతో మందికి ఉర్దూ పదాల అర్థం ఎలా తెలుస్తుంది?
అలాంటి ఇబ్బంది ఇక లేదు.  ఉర్దూ చదవటం రాని ఎక్కువ మందికి ఈ పుస్తకం ఎంతో ఉపయోగం.
ఉర్దూ పదాలని అకారాది  క్రమం లో తెలుగు లిపి లో వ్రాసి, ఆ పదం అర్థం తేలిక గా అర్థం అయ్యేలాగా మనకు అందించారు.

చిన్నతనం నుండి హిందీ సినిమా ల లోని ఉర్దూ పదాలు అర్థం తెలియక కొట్టు మిట్టాడి, ఉర్దూ తెలిసిన మిత్రులని వెతుక్కొని వేడుకొని, వారి కి వచ్చీ రాని తెలుగు లో చెభ్తే, మనకు దాని  అర్థం తెలిసే టప్పటికి, తల ప్రాణం తోక లోకి వచ్చేది.

రచయిత గారికి పలు భాషల లో ఉన్న పరిజ్ఞానం, ఈ పుస్తకం వినియోగ దారులకు నిజం గా వరమే, ఉర్దూ, దానికి దగ్గర గా ఉన్న పారశీకం, అరబ్బీ పదాలగురించి కూడా మనకు అవసర మైన మేరకు తెలుస్తంది.

అన్ని భాషలకు ఇదే పద్ధతి లో క్రమముగా తీసుకు వస్తే, తెలుగు మాత్రమే వచ్చిన చాలా మందికి వో వర ప్రసాదమే ఇటువంటిపుస్తకాలు. ఎమెస్కో వారి కృషి శ్లాఘనీయము. హైదరాబాద్ లోని  అన్ని పుస్తకముల దుకాణాలలోదొరుకుతున్నది. నేను నవోదయా వారి బుక్ షాప్ ( ఆర్య సమాజ మందిరం ఎదురు , సుల్తాన్ బజార్) లో కొనుక్కున్నా

No comments:

Post a Comment