Friday, December 3, 2010

Kalapoornodayam

రాయల వారి పుణ్యమా అని తెలుగు నాట అష్ట దిగ్గజాలు మనకు మంచి సాహితీ సంపద అందించారు. పింగళి సూరన గారి కళా పూర్ణోదయం ఇప్పటికీ నిత్య నూతనంగా మనల్ని అలరిస్తూనే ఉన్నది.దువ్వురి వెంకట రమణశాస్త్రి గారి స్వీయ చరిత్రచదువుతున్న సమయంలోఅయన  మధుర లాలస అనే పుస్తకం వ్రాసిన సంగతి తెలియ వచ్చింది.వెంటనే కళాపూర్ణోదయం మళ్లీ చదవాలని అనిపించింది. వచన రూపములో తెలుగు బ్లాగ్స్ లో నే దొరకటం నా అదృష్టం వెను వెంటనే డౌన్ లోడ్ చేసుకొని ప్రింట్ చేసుకొని చదివేసాను. తెలుగు భాష ని ప్రేమించే వ్యక్తులు ఉన్న కారణంగా, మంచి సాహిత్యం అందరూ చదవాలనే సత్ సంకల్పం ఉన్న మంచి వ్యక్తుల కారణం గా అంతటి పెద్ద కావ్యాన్ని వచన రూపం లో నా లాంటి సామాన్య వ్యక్తి కూడా చదవ గలిగాడు. మంచి అభిరుచి ఉన్న వ్యక్తులు తాము చదివిన పుస్తకాలు, విన్న సంగీతం, చూచిన ప్రదేశాలు నలుగురితో పంచుకుంటే ఎంతో ఆనందం గా ఉంటుంది ." పంచుకున్న పాలు మంచి పెంచునన్నాడు " శ్రీ ముళ్ళపూడి. అందుకనే నా ఈ తెలుగు బ్లాగ్. నెమలికన్ను బ్లాగ్ తో మనలని ఎంతో అలరిస్తున్న మురళీ గారు నా ఈ ప్రయత్నానికి ఆత్మీయ హస్తం అందించి వెన్ను తట్టి  ముందుకు తోసారు. తెలుగు భాష లో నా భావాలు ఎలా తెలుగు లో నే టైపు చేయాలో నేర్పిన గురు బ్రహ్మ, మురళీ గారికి  కి నమో వాకముల తో ఈ బ్లాగ్ శ్రీకారం చుట్టుకుంటున్నది.నెట్ వీక్షకుల నుండి ప్రోత్సాహం లభించగలదని ఆశిస్తూ

1 comment:

  1. రవీంద్రనాథ్ గారూ, బ్లాగ్ లోకానికి స్వాగతం. మీ అనుభవాలు, అనుభూతులను బ్లాగ్మిత్రులతో పంచుకునేందుకు చక్కని వేదికని ఏర్పాటు చేసుకున్నందుకు అభినందనలు.. మీ బ్లాగ్ ప్రయాణం అప్రతిహతంగా కొనసాగాలని మనసారా కోరుకుంటూ..

    ReplyDelete